సారథి న్యూస్, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలోని శంకర్ పల్లి కొండకల్ వద్ద ఉన్న 100 ఎకరాల్లో రూ.800 కోట్ల వ్యయంతో చేపట్టిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మంత్రి మాట్లాడుతూ.. ఈ ఫ్యాక్టరీ జిల్లాకే కాక తెలంగాణకే తలమానికం అని పేర్కొన్నారు. అనంతరం శంకర్ పల్లి మండలంలోని మొకీల చౌరస్తాలో టీఆర్ఎస్ జెండాను మంత్రి ఎగరవేశారు. కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, జడ్పీ చైర్మన్ అనితారెడ్డి, చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
- August 13, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- ముఖ్యమైన వార్తలు
- KONDAKAL
- MINISTER KTR
- RAILWAYCOACH
- TELANGANA
- కొండకల్
- మంత్రి కేటీఆర్
- రైల్వేకోచ్
- Comments Off on రైల్వేకోచ్ ఫ్యాక్టరీ తెలంగాణకే తలమానికం