సారథి న్యూస్, హుస్నాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ రైతుల కోసం వేలకోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారని హుస్నాబాద్ ఎమ్మెల్యే ఒడితెల సతీశ్‌కుమార్ పేర్కొన్నారు. గురువారం హుస్నాబాద్, అక్కన్నపేట మండలం పందిల్ల, జనగాం గ్రామాల్లో రైతు వేదికలకు భూమి పూజ చేసి మాట్లాడారు. సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమానికి వేల కోట్లు వెచ్చిస్తున్నారన్నారు. దేశానికే వెన్నెముకయిన అన్నదాతల్లో నూతన వ్యవసాయ విధానాలు అమలు కావడానికి ఈ వేదికలు తొడ్పతయన్నారు. కార్యక్రమంలో జడ్పీవైస్ చైర్మన్ రాజిరెడ్డి, ఎంపీపీలు మానన, లక్ష్మి, జడ్పీటీసీలు మంగ, సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
- July 16, 2020
- Archive
- కరీంనగర్
- షార్ట్ న్యూస్
- Farmers
- HUSNABAD
- KARIMNAGAR
- MLA
- రైతు వేదిక
- సీఎం కేసీఆర్
- Comments Off on రైతుల కోసం వేలకోట్లు