సారథి న్యూస్ నర్సాపూర్: రైతులను సంఘటితం చేసి వారి సమస్యలను తెలుసుకోవడానికి ఒక వేదిక కావాలని ఉద్దేశంతో సీఎం కేసీఆర్ రైతు వేదికల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని మెదక్ కలెక్టర్ ఎం.ధర్మారెడ్డి పేర్కొన్నారు. బుధవారం మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం మహమ్మద్ నగర్ ఆర్ తో పాటు కౌడిపల్లి లో రైతు వేదికల స్థలాలను పరిశీలించారు. రైతు వేదికలు త్వరగా పూర్తిచేయాలన్నారు. నియంత్రిత సాగు విధానాన్ని ఈ వేదిక ద్వారా అవగాహన కల్పించడానికి వీలవుతుందన్నారు. జిల్లాలో 55.7లక్షల మొక్కలను నాటే లక్ష్యంగా ఉన్నప్పటికీ ఇప్పటి వరకు ఆరులక్షల మొక్కలను నాటామన్నారు. రైతు వేదికల భవనాలకు ఉచితంగా స్టీల్ సిమెంట్ ఇసుక అందించేలా చూస్తామన్నారు. మహమ్మద్ నగర్ లో డంప్ యార్డును చూసి సర్పంచ్ దివ్య మైపాల్ రెడ్డిని అభినందించారు. ఆయన వెంట తహసీల్దార్ రాణాప్రతాప్ సింగ్, ఎంపీడీవో కోటిలింగం, ఏవో పద్మావతి ఉన్నారు.
- July 1, 2020
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- COLLECTOR
- medak
- RYTHU VEDIKA
- కలెక్టర్
- మెదక్
- రైతు వేదిక
- Comments Off on రైతులను సంఘటితం చేసేందుకే వేదికలు