సారథి న్యూస్, మెదక్: రైతులను మోసగిస్తే ఎంతటి వారైనా కఠిన చర్యలు తప్పవని మెదక్ కలెక్టర్ ధర్మారెడ్డి హెచ్చరించారు. గురువారం జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణంలోని ఆటోనగర్ లో ఉన్న వీరభద్ర, కేదారీశ్వరి ట్రేడింగ్ కంపెనీ ఫర్టిలైజర్ దుకాణాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీచేశారు. రైతులకు విక్రయించే ఎరువులు, విత్తనాలు, పురుగు మందులను ఈ –పాస్ మిషన్ ద్వారా నమోదు చేయాల్సి ఉంటుందని అసలు దానిని వినియోగిస్తున్నారా ? లేదా ? అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ–పాస్ మిషన్లను ఉపయోగించకుంటే ఫర్టిలైజర్ దుకాణాలపై కేసులు నమోదు చేయడంతో పాటు వాటి లైసెన్సులు రద్దు చేయాలని జిల్లా వ్యవసాయశాఖ అధికారి పరశురామ్ కు సూచించారు. అనంతరం దుకాణాల్లో ఉన్న లెడ్జర్ పుస్తకాలను కలెక్టర్ పరిశీలించి ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల నిలువ, అమ్మకాలకు సంబంధించిన అకౌంట్లను పరిశీలించారు. కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయాధికారి పరశురామ్, తహసీల్దార్ రవికుమార్ ఉన్నారు.
- July 17, 2020
- Archive
- Top News
- మెదక్
- లోకల్ న్యూస్
- COLLECTOR
- FERTILIZERS
- medak
- అగ్రికల్చర్
- కలెక్టర్
- మెదక్
- Comments Off on రైతులను మోసగిస్తే కఠిన చర్యలు