Breaking News

రైతులకు పట్టాబుక్కులు పంపిణీ

రైతులకు పట్టాబుక్కులు పంపిణీ

సారథి న్యూస్, అచ్చంపేట: నాగర్​కర్నూల్ ​జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు సోమవారం తన క్యాంపు ఆఫీసులో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చేతుల మీదుగా పేద దళిత రైతులకు పట్టాపాసు బుక్కులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కలెక్టర్ ​ఎల్.శర్మన్, నాగర్ కర్నూల్ జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పోకల మనోహర్, అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ తులసీరాం, వివిధ గ్రామాల రైతులు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్​లు, ఆర్డీవో, ఆయా మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.