సారథి న్యూస్, రామాయంపేట: రైతులకు గుడ్ న్యూస్..పంట రుణాల పరిమితిని పెంచేశారు.. ఇప్పటివరకు వరి పంటపై రూ.30వేల వరకు ఉన్న క్రాప్ లోన్ లిమిట్ ను కనిష్టంగా రూ.35వేల నుంచి గరిష్టంగా రూ.38వేలకు పెంచారు. ఇతరత్రా పంటలకు కూడా రూ.2వేల నుంచి రూ.4వేల వరకు పెంచి ఇచ్చేలా బ్యాంకులు నిర్ణయం తీసుకున్నాయి. వానాకాలం సీజన్ పంటల సాగుకు రైతులు సిద్ధమయ్యారు. బ్యాంకులు రైతులకు లోన్లు ఇచ్చే పనిలో పడ్డాయి. 2020-2021 ఏడాదికి బడ్జెట్ ప్రణాళికలో పంటలకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ను జిల్లా లిడ్ బ్యాంకులు ఖరారు చేశాయి. మారిన మార్గదర్శకాలకు అనుగుణంగా పట్టా పాస్ బుక్ జిరాక్స్ తో పాటు బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డ్, తాజా పహానీ, నో డ్యూ సర్టిఫికెట్ లను రైతులు బ్యాంకర్లకు అందిస్తే లోన్ మంజూరు చేయాలని నిర్ణయించారు. బ్యాంకుల్లో ఉన్న పాత క్రాప్ లోన్లను రెన్యూవల్ చేసుకునే వెసులుబాటు ఉంది. దాదాపు అన్ని రకాల వాణిజ్య పంటలపై లోన్ లిమిట్ ను పెంచారు. ఇప్పటివరకు వరిపంటపై రూ.30వేల వరకు ఉన్న క్రాప్ లోన్ లిమిట్ ను కనిష్టంగా రూ.35వేల నుంచి గరిష్టంగా రూ.38వేలకు పెంచారు. ఇతరత్రా పంటలకు కూడా రూ.2వేల నుంచి రూ.4వేల వరకు పెంచి ఇచ్చేలా బ్యాంకులు నిర్ణయం తీసుకున్నాయి.
2020-2021 సీజన్ లో క్రాప్ లోన్ ల పరిమితి
పంట కనిష్టం(రూ.ల్లో) గరిష్టం((రూ.ల్లో)
వరి 34,000 38,000
మొక్కజొన్న(నీటివసతి) 25,000 28,000
మొక్కజొన్న(వర్షాధారం) 20,000 23,000
పసుపు 60,000 68,000
సోయాబీన్ 22,000 24,000
కందులు (నీటివసతి) 17,000 20,000
కందులు 15,000 18,000
పత్తి 38,000 40,000
పత్తి (వర్షాధారం) 35,000 38,000
జొన్న (నీటివసతి) 15,000 20,000
జొన్న (వర్షాధారం) 14,000 18,000
మినుము 15,000 18,000
పెసర్లు 15,000 17,000
సజ్జ 11,000 13,000