గత ఐదేండ్లుగా తనపై 139 మంది లైంగికదాడి చేశారంటూ నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన దళిత యువతి ఆరోపించిన విషయం తెలిసిందే. ఆమె పలువురు ప్రముఖుల పేర్లను వెల్లడించింది. అందులో యాంకర్ ప్రదీప్, కృష్ణుడు తదితరులు ఉన్నారు. కాగా, ఈ ఆరోపణలపై ఇప్పటికే ప్రదీప్ స్పందించారు. తాజాగా, మరో నటుడు కృష్ణుడు కూడా ఈ వివాదంపై మాట్లాడారు. నాకు ఏపాపం తెలియదని చెప్పారు. కొందరు తనను కుట్రపూరితంగా ఈ వివాదంలోకి లాగుతున్నారన్నారు. ‘నాపై ఆరోపణలు రావడంతో షాక్‌కు గరయ్యాను. నాకు ఎటువంటి దురలవాట్లు లేవు. ఆరోపణలు రాగానే ఈ విషయం భార్యకు చెప్పాను. ఆమె నాకు సపోర్ట్‌గా నిలిచింది. ఒకరిపై ఆరోపణలు చేసే ముందు వారి కుటుంబం ఎంత ఇబ్బంది పడుతుందో చూడాలి. లాక్‌డౌన్ సమయంలో నల్గొండ నుంచి ఓ అమ్మాయి నా ఫ్యాన్ అంటూ మాట్లాడింది. నేను ఆమెతో తప్పుగా ఏమీ మాట్లాడలేదు. నాది ప్రేమ వివాహం. నాకూ ఓ కూతురు ఉంది. ఎవరో కుట్రపూరితంగా నాపేరు ఇరికించారు. నాపై తప్పడు ఆరోపణలు చేసేవారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాను’