సారథి న్యూస్, కర్నూలు: ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగానే కర్నూలు నగర పాలక పరిధిలో వ్యాపారాలు చేసుకోవాలని కమిషనర్ డీకే బాలాజీ సూచించారు. ఆదివారం ఆయన నగరంలోని కృష్ణానగర్, గణేష్ నగర్, ఎస్.నాగప్ప వీధి, నంద్యాల చెక్ పోస్టు ప్రాంతాల్లో కోవిడ్–19 నిబంధనలు పాటించని వారికి ఫైన్విధించారు. పాత బస్టాండ్ ఎస్.నాగప్ప వీధిలోని ఓ షాపు రెగ్జిన్ కవర్ ఏర్పాటు చేసుకోకపోవడంతో పాటు ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారాన్ని నిర్వహిస్తున్నందుకు సదురు దుకాణ యజమానికి రూ.500, అలాగే మాస్క్ ధరించకుండా వ్యాపారాలు నిర్వహిస్తున్నందుకు రూ.200 ఫైన్ వేశారు. దుకాణదారులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రతి ఇంటి నుంచి పిన్ పాయింట్ ప్రక్రియలో ఇంటింటి నుంచి చెత్తను సేకరించాక ఇంటి గోడలకు ఉన్న ఆర్ఎఫ్ఐడీ స్కానింగ్ ప్రక్రియ విధిగా చేయాలన్నారు.
- June 28, 2020
- Archive
- ఆంధ్రప్రదేశ్
- లోకల్ న్యూస్
- CORPORATION
- Kurnool
- కమిషనర్
- కరోనా
- కర్నూలు
- Comments Off on రూల్స్ పాటించకపోతే ఫైన్ పడుద్ది