ముంబై: సుశాంత్ కేసు అనేక మలుపులు తిరుగుతున్నది. రోజుకో ట్విస్ట్‌తో సంచలనంగా మారింది. సుశాంత్ మాజీ ప్రేయసి రియాతీరుపై తొలినుంచి అనేక అనుమానాలు ఉన్నాయి. ప్రస్తుతం ఆ అనుమానాలే నిజమవుతున్నాయి. రియా చక్రవర్తికి బాలీవుడ్‌లోని ప్రముఖులతోపాటు, డ్రగ్స్మాఫియాతోనూ సంబంధం ఉన్నట్టు సమాచారం. రియాకు డ్రగ్స్‌మాఫియాతో ఉన్న సంబంధంపై సీబీఐ ఇప్పటికే పలు ఆధారాలను సేకరించింది. రియా చక్రవర్తి అమాయకురాలేంకాదని.. ఆమె మహా ముదురు కేసును అధికారులు అనుమానిస్తున్నారు.
తాజాగా, నిషేధిత మాదక ద్రవ్యాల వ్యవహారంలో పాత్ర ఉందనే ఆరోపణలపై రియాపై నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) కేసు నమోదు చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఇచ్చిన సమాచారం మేరకు ఎన్‌డీపీఎస్(నార్కోటిక్స్ డ్రగ్స్ అండ్ సైకోట్రాపిక్ సబ్‌స్టాన్సెస్) చట్టంలోని పలు సెక్షన్ల కింద రియాతోపాటు ఇతరులపైనా కేసులు పెట్టినట్లు ఎన్‌సీబీ బుధవారం వెల్లడించింది. నటుడు సుశాంత్‌సింగ్‌కు మాదక ద్రవ్యాలతో సంబంధమున్నదా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తామని ఎన్‌సీబీ డీజీ రాకేశ్ ఆస్తానా తెలిపారు. సుశాంత్ మృతి కేసును మనీ ల్యాండరింగ్ కోణంలో దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఈడీ.. రియా సెల్‌ఫోన్‌లోని వాట్సాప్ మెసేజీల్లో కొన్నింటిని తొలగించినట్లు గుర్తించింది. వీటిని తిరిగి సంగ్రహించి పరిశీలించగా అవి నిషేధిత గంజాయి తదితర మాదక ద్రవ్యాలతో సంబంధమున్నవిగా తేలింది.
సిద్ధార్థ్‌ను ప్రశ్నించిన సీబీఐ
సుశాంత్ సింగ్ స్నేహితుడు సిద్ధార్ధ్ పితానీని సీబీఐ వరుసగా ఆరో రోజు బుధవారం కూడా ప్రశ్నించింది. డీఆర్‌డీవో అతిథి గృహానికి బాంద్రా పోలీసు బృందం కూడా వచ్చి, గంట తర్వాత తిరిగి వెళ్లిందని అధికారులు తెలి పారు. సుశాంత్ మరణించిన జూన్ 14వ తేదీన అతని ఫ్లాట్‌లో సిద్ధార్థ్‌తోపాటు పనిమనిషులు ఇద్దరు కూడా ఉన్నారు.