Breaking News

రియా చక్రవర్తి జాడ తెలియట్లేదు

రియా చక్రవర్తి జాడ తెలియట్లేదు

ముంబై: బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో బీహార్‌‌ పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసుకు సంబంధించి సుశాంత్‌ సోదరి, అతని మాజీ ప్రేయసి, వంటమనిషి తదితరులను విచారించిన పోలీసులు రియా చక్రవర్తి కోసం వెతుకుతున్నారు. ఆమె జాడ తెలియడం లేదన్నారు. ‘విచారణ మొదటి దశలో ఉంది. కోర్టు పరిధిలో ఉంది. రియా చక్రవర్తి ఎక్కడ ఉందో తెలియడం లేదు. ఆమె కోసం వెతుకుతున్నాం’ అని బీహార్‌‌ డైరెక్టర్‌‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ గుప్తేశ్వర్‌‌ పాండ్యా అన్నారు. రియా చక్రవర్తి వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇంకా తీర్పు చెప్పలేదన్నారు. బీహార్ నుంచి నలుగురు పోలీసులు ముంబై వెళ్లి కీలక ఆధారాలు సేకరించారని తెలిపారు.

సుశాంత్‌ బ్యాంక్‌ అకౌంట్‌, లావాదేవీలు సమాచారం కూడా బ్యాంక్‌ నుంచి తీసుకున్నారని డీజీపీ చెప్పారు. సుశాంత్‌ ఫ్యామిలీకి కచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పారు. సుశాంత్‌ అకౌంట్‌ నుంచి రియా చక్రవర్తి రూ.15 కోట్లు అజ్ఞాతవ్యక్తి అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్‌‌ చేసిందని సుశాంత్‌ తండ్రి బీహార్‌‌లో కంప్లైంట్‌ ఫైల్‌ చేశారు. కాగా.. ఇదే కేసుకు సంబంధించి ముంబై పోలీసులు కూడా దర్యాప్తు ప్రారంభించారు. దీంతో కేసును బీహార్‌‌ నుంచి ముంబైకి తరలించాలని రియా చక్రవర్తి సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.