సుశాంత్ రాజ్‌పుత్ కేసు దేశంలోనే పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో మొదటి నుంచి సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఆమెను ఇప్పటికే ఎన్సీబీ అరెస్ట్ చేసింది. అయితే రియాకు డ్రగ్స్ మాఫియాతో సంబంధాలు ఉన్నట్టు సీబీఐ, ఎన్సీబీ విచారణలో తేలింది. దీంతో ఈ కేసులో పలు సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. బాలీవుడ్‌కు చెందిన అనేకమంది ప్రముఖులు డ్రగ్స్ తీసుకుంటున్నట్టు పోలీసులకు ఆధారాలు దొరికాయి. ఈ విషయంపై ఇప్పటికే జాతీయమీడియాలో వార్తలు వస్తున్నాయి.
బాలీవుడ్‌కు చెందిన 25 మంది డ్రగ్స్ తీసుకుంటారని రియా.. సీబీఐకి చెప్పినట్టు సమాచారం. తీగ లాడితే డొంకంతా కదిలినట్టుగా.. సుశాంత్ కేసులో సీబీఐకి డ్రగ్స్మాఫియాకు సంబంధించిన ఆధారాలు దొరికాయి. అయితే రియా చెప్పిన ఆ 25 మంది ఎవరన్న అంశం ప్రస్తుతం ముంబైలో చర్చనీయాంశమైంది. సుశాంత్ మరణం తర్వాత బాలీవుడ్ మొత్తం అట్టుడుకుతోంది. కొంతకాలం పాటు నెపోటిజం వివాదం తెరమీదకు రాగా ప్రస్తుతం డ్రగ్స్మాఫియా వ్యవహరం నడుస్తోంది. నిజంగా డ్రగ్స్ మాఫియాతో ఎంతమందికి సంబంధం ఉంది.. పోలీసులు ఎవరెవరిని అరెస్ట్ చేయనున్నారో అన్న అంశంమై ప్రస్తుతం ముంబైలో ఆసక్తి నెలకొంది.