సుశాంత్ కేసులో అరెస్ట్యిన రియా చక్రవర్తి పెట్టుకున్న బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టేసింది. దీంతో ఆమెకు కొంతకాలం పాటు జైలు జీవితం తప్పేటట్లు లేదు. రియా చక్రబొర్తి ఆశలు అడియాశలయ్యాయి. ఆమె పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. దీంతో ఆమె మరికొన్నాళ్లు జైలులోనే ఉండబోతోంది. ఈ నెల 22 వరకు రియా రిమాండ్ ఖైదీగా ఉండబోతున్నది. మొదటి నుంచి అనేక మలుపులు తిరిగిన సుశాంత్ ఆత్మహత్య కేసు అటుతిరిగి ఇటు తిరిగి రియా మెడకు చుట్టుకున్నది. సుశాంత్ కేసులో డ్రగ్స్కోణం వెలుగుచూడటంతో రియాకు చిక్కులు వచ్చి పడ్డాయి. డ్రగ్స్ మాఫియాతో రియాకు సంబంధం ఉన్నట్టు ఎన్సీబీ, సీబీఐ పలు కీలక ఆధారాలు సేకరించింది. అనంతరం ఎన్సీబీ రియా చక్రవర్తిని అరెస్ట్ చేసి మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచింది. కోర్టు ఆమెకు ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది. అయితే తాజాగా రియాచక్రవర్తి పెట్టుకున్న బెయిల్ పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. రియాతోపాటు ఆమె సోదరుడు షోవిక్, మిగిలిన ఏడుగురు నిందితులు పెట్టుకున్న బెయిల్ పిటిషన్లను కోర్టు తిరస్కరించింది. అయితే రియా ఇప్పుడు ముంబయి హైకోర్టును ఆశ్రయించనున్నట్టు సమాచారం. కాగా ఆమె బయటకు వస్తే సాక్షులను ప్రభావితం చేస్తుందని ఎన్సీబీ వాదించింది.
- September 11, 2020
- Archive
- Top News
- జాతీయం
- సినిమా
- BAIL
- CASE
- CBI
- HIGHCOURT
- MUMBAI
- NCB
- RIA
- కొత్తకేసులు
- రియాచక్రవర్తి
- హైదరాబాద్
- Comments Off on రియాకు నో బెయిల్