Breaking News

‘రిపబ్లిక్’ ఎడిటర్​ అర్నబ్ గోస్వామి అరెస్ట్​ హేయం

‘రిపబ్లిక్’ ఎడిటర్​అర్నబ్ గోస్వామి అరెస్ట్​హేయం

సారథి న్యూస్, హైదరాబాద్: రిపబ్లిక్​టీవీ చీఫ్ ​ఎడిటర్ ​అర్నబ్​గోస్వామిని అరెస్ట్ ​చేయడం అప్రజాస్వామిక చర్య​ అని జర్నలిస్టు అసోసియేషన్ ​ఆఫ్ ​తెలంగాణ(జాట్) వ్యవస్థాపక అధ్యక్షుడు పగుడాకుల బాలస్వామి విమర్శించారు. రాజకీయ కక్షతో మీడియాకు సంకేళ్లు వేయడం హేయమైన చర్య అని ఖండించారు. అధికారబలంతో భావప్రకటన స్వేచ్ఛను హరిస్తున్నారని మండిపడ్డారు. జాతీయభావాలను ప్రకటించడం నేరమా? అని ఆయన ప్రశ్నించారు. జాతివ్యతిరేక శక్తులపై దేశభక్తితో పోరాడే పత్రికాప్రతినిధులు, మీడియా సంస్థలను ఇబ్బందులకు గురిచేయడమే లక్ష్యంగా మహారాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గతంలో మూసివేసిన కేసును తిరగదోడి అర్నబ్​ను అత్యంత అవమానకరంగా అరెస్ట్​ చేయడం అమానవీయమన్నారు. మహారాష్ట్రలో పెట్రేగిపోతున్న మాఫీయా, డ్రగ్స్​ వ్యవహారం, లవ్​జిహాదీ చర్యలను నిర్భయంగా ప్రజల ముందు ఉంచిన జర్నలిస్టు, రిపబ్లిక్​ చానెల్​పై శివసేన కూటమి కక్షగట్టడం, కాంగ్రెస్​ అధినేత్రి సోనియాగాంధీ ఆదేశాలతో అరెస్ట్​ చేయడం దారుణ చర్య​ అని ఆక్షేపించారు. అర్నబ్ ​అరెస్ట్​ను దేశవ్యాప్తంగా ఉన్న జర్నస్టులు ఖండించాలని, ఆయన వెంటనే విడుదల చేయాలని పగుడాకుల బాలస్వామి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ ​చేశారు.