సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): ఎన్నడూ లేని విధంగా కృష్ణానది పోటెత్తుతోంది. 2009లో కృష్ణమ్మ ఓ ప్రళయం సృష్టించింది. 2019లో రికార్డు స్థాయిలో పరవళ్లు తొక్కింది. 2020లో జూరాల మరో విధ్వంసాన్ని సృష్టించబోతుందా..? అవుననే సందేహాలు కలుగుతున్నాయి. ఎందుకంటే గతంలో కన్నా ఈ సారి జూరాల ప్రాజెక్టుకు ఈ రెండు రోజుల్లో రికార్డు స్థాయిలో వరద ప్రవాహం వచ్చే అవకాశం ఉందని జూరాల అధికారులు అంచనా వేస్తున్నారు. జూరాలకు వస్తున్న వరద ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని మొత్తం గేట్లు ఎత్తివేసి దిగువనకు నీటి విడుదల చేసే అవకాశం ఉంది. వరద ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే జూరాల పరిసర ప్రాంతాల గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఎవరు కూడా నది పరిసర ప్రాంతాల్లోకి వెళ్లకుండా అధికారులు హెచ్చరికలు జారీచేశారు.
- October 15, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- GADWALA
- JURALA
- KRISHNA RIVER
- SRISAILAM
- కృష్ణానది
- జూరాల
- జోగుళాంబ గద్వాల
- భారీవర్షం
- శ్రీశైలం
- Comments Off on రికార్డు స్థాయిలో జూరాలకు వరద