ఢిల్లీ: మనదేశంలో కరోనా విజృంభణ ఏ మాత్రం ఆగడం లేదు. గత 24 గంటల్లో కొత్తగా 60,963 కొత్తకేసులు నమోదయ్యాయి. కాగా 56,110 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి కావడం ఊరట నిచ్చే అంశం. ఇప్పటివరకు 16,39,599 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో రికవరీ రేటు 70.38 శాతం ఉన్నదని వైద్యశాఖ అధికారులు వెల్లడించారు. దేశంలోని మొత్తం కేసుల సంఖ్య 23,29,638 కి చేరుకున్నది. ఇప్పటివరకు 46,091మంది కోరోనా మృతిచెందగా.. 6,43,948 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేవరకు ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని.. అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలని, తప్పనిసరిగా మాస్కులు ధరించాలని అధికారులు సూచిస్తున్నారు.