సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా ఉధృతి కొంచెం తగ్గినట్టే కనిపిస్తోంది. గత మూడు నాలుగు రోజులతో పోల్చితే ఆదివారం కేసులు తగ్గాయి. ఆదివారం తాజాగా 1,269 పాజిటివ్కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారినపడి 8 మంది మృతిచెందారు. అయితే ఇప్పటి వరకు 356 మంది చనిపోయారు. ఇప్పటి వరకు 1,70,324 మందిని పరీక్షించారు. మొత్తం పాజిటివ్కేసుల సంఖ్య 34,671కు చేరింది. జీహెచ్ఎంసీ పరిధిలో 800 కేసులు, రంగారెడ్డి జిల్లా 132, మేడ్చల్ 94, సంగారెడ్డి 36, వరంగల్ అర్బన్12, కరీంనగర్ 23, మెదక్14, మహబూబ్నగర్17, నాగర్కర్నూల్23, నల్లగొండ జిల్లాలో 15 చొప్పున కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ హెల్త్బులెటిన్ను వెల్లడించింది.
- July 12, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- CARONA
- GHMC
- POSITIVE CASES
- కరోనా
- తెలంగాణ
- హైదరాబాద్
- Comments Off on రాష్ట్రంలో 1,269 పాజిటివ్ కేసులు