Breaking News

రామాలయానికి స్థలం కేటాయిండి

సారథిన్యూస్, రామడుగు: కరీంనగర్​ జిల్లా రామడుగులో రామాలయ నిర్మాణానికి స్థలం కేటాయించాలని బీజేపీ నాయకులు శనివారం తహసీల్దార్​కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండల కేంద్రంలోని నర్సింగరావు చెరువు లో గుండు పై రాముని పాదుకలు ఉండటం వల్ల రామడుగు అనే పేరు వచ్చిందని పురాణాల ద్వారా తెలుస్తుందని పేర్కొన్నారు. ఆలయ నిర్మాణానికి ఒక ఎకరం శిఖం భూమి కేటాయించాలని కోరారు. కార్యక్రమంలో పురేళ్ల శ్రీకాంత్, అనుపురం పరుశరాం, శివ, భరత్, నరేశ్​, సురేశ్​ తదితరులు పాల్గొన్నారు.