సారథి న్యూస్, సిద్దిపేట: దివంగత దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మృతి తనను తీవ్రంగా కలిచివేసిందని మంత్రి టి.హరీశ్‌రావు ఆవేదన వ్యక్తంచేశారు. ఆయన లేకుండా ఒక కార్యక్రమంలో పాల్గొనాల్సి వస్తుందని అనుకోలేదని విచారం వ్యక్తంచేశారు. గురువారం దుబ్బాక అసెంబ్లీ నియోజవర్గంలోని దౌల్తాబాద్ వీటీటీ ఫంక్షన్ హాల్ లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. అంతుకుముందు దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధికి ఆయన ఎంతో కృషిచేశారని కొనియాడారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, పలు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
- August 20, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- DUBBAKA
- HARISHRAO
- RAMALINGAREDDY
- దుబ్బాక
- రామలింగారెడ్డి
- హరీశ్‌రావు
- Comments Off on రామలింగారెడ్డి మృతి కలిచివేసింది