సారథి న్యూస్, రామగుండం: రామగుండం పారిశ్రామిక ప్రాంతం ఐటీ పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలమైన ప్రాంతమని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. ఐటీశాఖ మంత్రి కె.తారక రామారావు ఆదేశాల మేరకు ఐటీ సీఈవో(ప్రమోషన్స్) విజయ్ రంగనేనితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి ఐటీ పార్క్ వస్తే యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అన్నారు.
మంత్రి నిరంజన్‌రెడ్డిని కలిసిన కోరుకంటి
అంతకుముందు ఆయన రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డిని కలిశారు. రైతు వేదికలు, వ్యవసాయ మార్కెట్ ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించారు. రామగుండం నియోజవర్గంలో నూతనంగా నిర్మించిన రైతువేదికలతో పాటు పుట్నూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ప్రారంభోత్సవం, కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరుకావాలని కోరారు. ఎమ్మెల్యే వెంట సర్పంచ్ బండారి ప్రవీణ్ కుమార్, సతీష్ ఉన్నారు.
- January 13, 2021
- Archive
- తెలంగాణ
- IT INDUSTRY
- MINISTER KTR
- MLA KORUKANTI
- RAMAGUNDAM
- ఎమ్మెల్యే కోరుకంటి చందర్
- ఐటీ పరిశ్రమ
- మంత్రి కేటీఆర్
- రామగుండం
- Comments Off on రామగుండం ఐటీ పరిశ్రమలకు అనువైన ప్రాంతం