గోదావరిఖని: ముంబైలోని అంబేద్కర్ ఇల్లు( రాజగృహ) పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. నిందితులను గుర్తించడంలో మహారాష్ట్ర, కేంద్రప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. ఈ ఘటనపై స్పందించకపోతే ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో అన్ని దళితసంఘాలను కలుపుకుపోయి దేశవ్యాప్త ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. శనివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో వికలాంగుల హక్కుల పోరాట సమితి (వీహెచ్పీఎస్) ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్, వీహెచ్పీఎస్ నాయకులు మంతని సామిల్ మాదిగ, చింతరెడ్డి సంతోష, నూతి ఉమారాణి, ముంద రవికుమార్, అంబాల రాజేందర్, ,కన్నం స్వామి, వెంకటేశ్వర్లు, కనుకుంట్ల సమ్మయ్య, పల్లెబాపు, చందు మాదిగ, దుర్గాప్రసాద్, ఉప్పులేటి పర్వతాలు, ధర్మేందర్, రాసపెల్లి రవికుమార్, కన్నూరి ఓదెమ్మ, నక్క రాజేందర్, కాంపెల్లి స్వామి, జూల చంద్రశేఖర్, కన్నూరి రాజయ్య, స్వరూప, రేష్మా ,సుధాకర్, శ్రీనివాస్, రాజేశ్వరి, వెంకటేశ్వర్లు, మోహిని, శ్రీనివాస్, రాజేందర్ దాసరి నరేశ్ తదితరులు పాల్గొన్నారు.
- July 18, 2020
- Archive
- కరీంనగర్
- GODAVARI
- MANDA KRISHNA
- MRPS
- RAJAGRUHA
- గోదావరిఖని
- రాజగృహ
- Comments Off on రాజగృహపై దాడి హేయం