‘ఇద్దరమ్మాయిలతో’, ‘సరైనోడు’, ‘నేనే రాజు నేనే మంత్రి’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ వంటి సినిమాల్లో గ్లామర్ పాత్రలతో మెప్పించింది కేథరిన్ థ్రెస్సా. సరైనోడు సినిమాలో గ్లామర్ ఎమ్మెల్యేగా ఆకట్టుకున్న కేథరిన్‌ను రవితేజ మూవీలో స్పెషల్ సాంగ్ కోసం తీసుకోవాలనుకుంటున్నారట. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘క్రాక్’ సినిమా చేస్తున్నాడు రవితేజ. అది పూర్తయ్యాక ‘రాక్షసుడు’ ఫేమ్ రమేష్ వర్మ డైరెక్షన్ లో నటించనున్నాడు.
ఈ సినిమాకు ‘కిలాడీ’ అనే టైటిల్ ను కూడా రిజిస్ట్రర్ చేయించాడట డైరెక్టర్ రమేష్ వర్మ. రవితేజ పోలీసాఫీసర్ గా కనిపించనున్న ఈ చిత్రాన్ని కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్నారు. హీరోగా, విలన్ గా రెండు డిఫరెంట్ క్యారెక్టర్స్ తో కనిపించనున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్, నభా నటేష్ ను హీరోయిన్లుగా ఎంపికచేశారు. అయితే మూవీలో ఐటమ్ సాంగ్ కూడా ఉండడంతో ఈ పాటలో రవితేజతో చిందులేసేందుకు కేథరిన్ అయితే సూట్ అవుతుందని ఆమెను సంప్రదిస్తున్నారట మేకర్స్. తెలుగులో అవకాశాలు తగ్గడంతో తమిళ సినిమాలపై దృష్టిపెట్టిన కేథరిన్ టాలీవుడ్ లో మరిన్ని చాన్స్‌ల కోసం స్పెషల్ సాంగ్ లో మెరిసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో వేచిచూడాలి.