సారథి న్యూస్, ఖమ్మం: కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునేవారికి సిమ్యులేటర్ ఎంతో ఉపయోగకరమని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని రవాణాశాఖ కార్యాలయంలో సోమవారం ఆయన డ్రైవింగ్ సిమ్యులేటర్‌ను ప్రారంభించారు. అనంతరం కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. కరోనా విపత్తువేళ రవాణాశాఖలో విప్లవాత్మక మార్పులు చేశామని చెప్పారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుంటున్నామని అన్నారు. కార్యక్రమంలో రవాణాశాఖ అధికారులు, టీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
- August 10, 2020
- Archive
- ఖమ్మం
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- DRIVING
- KAMMAM
- MINISTER
- NEW
- PUVVADA AJAY
- ఖమ్మం
- సిమ్యులేటర్
- Comments Off on రవాణాశాఖలో విప్లవాత్మక మార్పులు