Breaking News

‘మోసగాళ్ల’కు వెంకీ వాయిస్

మోసగాళ్లకు వెంకీ వాయిస్​


జెఫ్రీ గీ చిన్ దర్శకత్వంలో మొదలు పెట్టిన తన కొత్త సినిమా ప్రమోషనల్ యాక్టివిటీస్ విషయంలో ఏ మాత్రం వెనుకంజ వేయడం లేదు మంచు విష్ణు. తను హీరోగా నటిస్తూ, నిర్మిస్తున్న ఈ చిత్రంలో విష్ణుకు సిస్టర్‌గా కాజల్‌ నటిస్తుండగా రుహీసింగ్ హీరోయిన్‌. సునీల్‌శెట్టి కీలకపాత్ర పోషిస్తున్నాడు. ప్రపంచలోనే అతిపెద్ద ఐటీ స్కాం ఆధారంగా రూపొందిస్తున్న ఈ సినిమాను తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ, ఇంగ్లిష్​ భాషల్లో విడుదల చేయనున్నారు. చాలా గ్యాప్ తరువాత వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు పెట్టుకున్న విష్ణు, అందుకు తగ్గట్టే ప్రమోషనల్ యాక్టివిటీస్ ప్లాన్ చేశాడు. రీసెంట్‌గా అల్లు అర్జున్ చేత టీజర్‌ రిలీజ్‌ చేయించిన విష్ణు ఇప్పుడు వెంకటేశ్​ చేత వాయిస్ ఓవర్ ఇప్పిస్తున్నాడు. ఈ విషయాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. కీలక పాత్రల పరిచయం మొదలు, సినిమాలోని ప్రదాన సీన్ల వరకూ వెంకటేష్ వాయిస్ ఓవర్ ఉంటుందట. వెంకీ వాయిస్ సినిమాకి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనుందట. అలాగే ‘మోసగాళ్లు’ థీమ్‌పోస్టర్ ను కూడా వెంకటేశ్​ రిలీజ్ చేయడం మరో విశేషం. ప్రమోషన్‌లో స్టార్ హీరోలను భాగం చేస్తూ మూవీపై భారీ హైప్ క్రియేట్ చేస్తున్న విష్ణుకు ఈ సినిమా ఎంత సక్సెస్‌ ఇస్తుందో చూడాలి.