Breaking News

మోడీ పాలన భేష్​

BJP

సారథి న్యూస్​, హుస్నాబాద్: ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ పాలనలో దేశంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని బీజేపీ అక్కన్నపేట మండల అధ్యక్షుడు గొల్లపల్లి వీరాచారి పేర్కొన్నారు. కరీంనగర్​ జిల్లా అక్కన్నపేట మండలంలో ఆయన మోదీ ఏడాది పాలనపై ఇంటింటి ప్రచారం నిర్వహించారు. దేశవ్యాప్తంగా ముస్లిం మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను తొలగించేందుకు కేంద్రప్రభుత్వం ట్రిపుల్ తలాక్ చట్టాన్ని తీసుకొచ్చిందని చెప్పారు. 70 ఏళ్లుగా పరిష్కారం కాని ఆర్టికల్ 370 రద్దు చేసి కాశ్మీర్​ ప్రజలకు విముక్తి కల్పించిన గొప్ప నాయకుడని కొనియాడారు. కార్యక్రమంలో గౌరవెల్లి బూత్ కమిటీ ప్రెసిడెంట్ వరుణ్, రాజశేఖర్, మణిదీప్, మణికంఠ, సంపత్ రాజ్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు