మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ కాంబినేషనల్ లో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ చిత్రం సెట్స్ పైకి వెళ్లేందుకు సన్నద్ధమవుతోంది. మెగా సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. చిరంజీవి దేవాదాయశాఖలో జరిగే అన్యాయాలను వెలికితీసే పాత్ర పోషిస్తున్నందున్న.. ప్రస్తుత పరిస్థితుల్లో బయట పరిసరాల్లో షూటింగ్ చేసేందుకు వీలు లేదు కాబట్టి రామోజీ ఫిల్మ్ సిటీ లో ఓ పురాతన దేవాలయం సెట్ వేస్తున్నారట టీమ్.
ఎండోమెంట్ విభాగానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగిగా కనిపించేందుకు మోగాస్టార్ లుక్ కూడా చేంజ్ చేశారు. యంగ్‌గా కనిపించేందుకు బరువు తగ్గి చాలా మేకోవర్ అయ్యారు కూడా. హీరోయిన్గా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. రామ్ చరణ్ మాజీ నక్సలైట్ గా కనిపించబోతున్నాడు. చరణ్ పాత్ర ఎమోషనల్ పాత్రగా ఉంటుందని, తనకు హీరోయిన్ కూడా ఉంటుందంటున్నారు. రెజీనా కూడా ఓ సాంగ్ లో మోగాస్టార్తో స్టెప్స్ కలిపిన ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.