సారథి న్యూస్, హైదరాబాద్: మున్సిపాలిటీల్లో రెవెన్యూ మేళాకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రాపర్టీ టాక్స్ ఇతర రెవెన్యూ విభాగం సంబంధిత సమస్యలపై ప్రతి సోమవారం, బుధవారం సదస్సులు నిర్వహించి పరిష్కరించనుంది. ఈ మేరకు మున్సిపల్ శాఖ కీలక ఆదేశాలు జారీచేసింది. ఈ అవకాశాన్ని సెప్టెంబర్ 15 వరకు కల్పిస్తున్నట్టు పేర్కొంది. రెవెన్యూ సదస్సులు ఉదయం 10:30 గంటలకు మున్సిపల్ కార్యాలయాల్లో జరుగుతాయని వెల్లడించింది.
– డోర్ నంబర్ కోసం అసైన్మెంట్ కాపీ తప్పనిసరి తీసుకురావాలి.
– పేరు మార్పునకు మోటివేషన్ కాపీ, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు.
– ఇల్లు అమ్మినట్లయితే ఇంటిపన్ను రద్దు కోసం ఫోటో, చివరిగా కట్టిన ఇంటి పన్ను రసీదు, ఇట్టి పన్ను ఎక్కువ వచ్చినట్లయితే అసైన్మెంట్ కాపీ ఇంటి ఫొటో సంబంధిత డాక్యుమెంట్లు అవసరమవుతాయి.
– డబుల్ అసైన్మెంట్ అయితే ఇంటి పర్మిషన్ అసైన్ మెంట్ నంబర్లు, మొదటగా కట్టిన ఇంటి పన్ను రసీదు తీసుకురావాలని స్పష్టంచేసింది.
- August 23, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- MUNCIPALITIES
- REVENUE MELA
- TELANGANA
- తెలంగాణ
- మున్సిపాలిటీలు
- రెవెన్యూమేళా
- Comments Off on మున్సిపాలిటీల్లో రెవెన్యూ మేళా