Breaking News

ముగ్గురిని బలిగొన్న నిర్లక్ష్యం

సారథిన్యూస్​, సూర్యాపేట: కాలకృత్యాలు తీర్చుకొనేందుకు రోడ్డు పక్కన నిలబడి ఉన్న ముగ్గురిని కారు ఢీకొట్టడంతో వారు అక్కడికక్కడే మృతిచెందారు. ఆంధ్రప్రదేశ్​లోని కృష్ణా జిల్లా కృత్తివేలు మండలం ఇంటెరు గ్రామానికి చెందిన నాగ కోటేశ్వరరావు, దుర్గ, మొగులమ్మ, కొండబాబు శుక్రవారం ఉదయం విజయవాడ నుంచి హైదరాబాద్​కు కారులో వస్తున్నారు. ఈ క్రమంలో కాలకృత్యాలు తీర్చుకొనేందుకు సూర్యాపేట జిల్లా మునగాల మండలం మొద్దుల చెరువు వద్ద కారు ఆపారు. వారు రోడ్డు పక్కన నిలబడి ఉండగా వెనుకనుంచి మరో కారు వేగంగా వచ్చి నలుగురిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో సూర్యాపేట కు తరలించారు. మృతిచెందిన వారిలో పది సంవత్సరాల బాలిక(10) ఉన్నది. మునగాల సీఐ శివశంకర్ గౌడ్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు.