తనపై తప్పుడు వార్తలు రాస్తే కేసు పెడతానంటూ శ్రద్ధాదాస్ మీడియాను హెచ్చరించారు. శ్రద్ధాదాస్ బిగ్బాస్ సీజన్ 4లో పాల్గొనబోతుందంటూ ఇటీవల ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పలు తెలుగు వెబ్సైట్లలోనూ ఈ వార్తను ప్రచురించారు. దీంతో శ్రద్ధాదాస్ ఫైర్ అయ్యారు. ‘బిగ్బాస్ నిర్వాహకులు ఎవరూ తనను సంప్రదించలేదు. నేను కూడా బిగ్బాస్లో చేరతానని ఎప్పడూ ప్రకటించలేదు. అయినా ఇటువంటి తప్పడు వార్తలు ఎందుకు ప్రచురించారు’ అంటూ ఆమె ఫైర్ అయ్యారు. మరోసారి తనపై తప్పుడు వార్తలు రాస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. కాగా శ్రద్ధాదాస్ తీరుపై నెట్జన్లు మండిపడుతున్నారు. ఇంత చిన్న విషయానికే అంత సీరియస్ కావాలా? సింపుల్గా నేను బిగ్బాస్లో పాల్గొనడం లేదు అంటూ ప్రకటిస్తే సరిపోతుంది కదా! అని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఏది ఏమయినా శ్రద్ధ కోపానికి కారణం మరొకటి ఉందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.
- July 28, 2020
- Archive
- సినిమా
- FAKENEWS
- MEDIA
- SHRADDADAS
- WARNING
- మీడియా
- శ్రద్ధాదాస్
- Comments Off on మీడియాపై శ్రద్ధాదాస్ ఫైర్