అందాల భామ రకుల్ ప్రీత్‌సింగ్ మరోసారి మీడియాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నిజానిజాలు తెలుసుకొని వార్తలు రాయాలంటూ ఫైర్ అయ్యారు. ఇంతకు ఈ భామకు కొపం తెప్పించిన ఈ వార్త ఎంటో తెలుసా.. రకుల్ శివకార్తికేయన్ సరసన తమిళంలో ‘అయలాన్’ అనే సినిమా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. అయితే లాక్‌డౌన్‌తో షూటింగ్ ఆగిపోయింది. ఇటీవల ప్రభుత్వాలు షూటింగ్ కు అనుమతి ఇవ్వడంతో తిరిగి చిత్రీకరణ ప్రారంభించాలనుకున్నారు చిత్ర నిర్మాత. కానీ కరోనా తగ్గే వరకు తాను షూటింగ్లో పాల్గొనని రకుల్ ప్రీత్మొండికేస్తున్నదంటూ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. దీంతో రకుల్ మీడియాపై చిర్రుబుర్రలాడారు. ‘షూటింగ్ ఎప్పుడు ప్రారంభిస్తారా అని నేను ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే పని చేయడానికి ఆసక్తిగా ఉన్నాను’ అంటూ చెప్పుకొచ్చారు. తనపై తప్పడు వార్తలు రాయడం సరికాదన్నారు. కాగా ఈ వార్తలకు ‘అయలాన్’ చిత్రదర్శకుడు రవికుమార్ స్పందిస్తూ ‘రకుల్ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్. ఆమె గురించి వదంతులు రావడం దురదృష్టకరం’ అన్నారు. ఇంకా చిత్రనిర్మాత ఈ విషయంపై స్పందించకపోవడం గమనార్హం.
- June 28, 2020
- Archive
- Top News
- సినిమా
- FIRE
- MEDIA
- RAKUL
- TAMIL
- అయలాన్
- శివకార్తికేయన్
- Comments Off on మీడియాపై రకుల్ ఫైర్ ఎందుకంటే..