Breaking News

మిన్నంటిన సంబరాలు

మిన్నంటిన సంబరాలు

సారథి న్యూస్, కర్నూలు: పోరాటం.. ఆందోళన.. ఉద్యమానికి తోడు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఉక్కు సంకల్పంతో గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ మూడు రాజధానుల ఏర్పాటుకు ఆమోదముద్ర వేశారని ఎంపీ సంజీవ్‌ కుమార్‌, ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్‌ పునరుద్ఘాటించారు. న్యాయరాజధానిగా కర్నూలు, శాసన రాజధానిగా అమరావతి, పరిపాన కేంద్రంగా విశాఖపట్నంను ప్రకటించినందుకు శనివారం స్థానిక కొండారెడ్డి బురుజు వద్ద వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. పెద్దసంఖ్యలో పటాకులు కాల్చారు. కళాకారులు డప్పు దరువులు, కోలాటం వేశారు. అనంతరం కార్యకర్తలు, నాయకులకు ఎమ్మెల్యే, ఎంపీలు స్వీట్లు పంచిపెట్టారు.

ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి, అక్కడ నుంచి పాదయాత్రగా వెళ్లి డాక్టర్​బీఆర్‌. అంబేద్కర్‌, వైఎస్సార్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళుర్పించారు. సీఎం జగన్​మోహన్‌ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కార్యక్రమానుద్దేశించి ఎంపీ సంజీవ్‌ కుమార్‌, ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్‌ మాట్లాడుతూ.. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సీమ అభివృద్ధికి ప్రత్యేక దృష్టిసారించారన్నారు. సమపాలన.. సముచిత న్యాయం అందించాన్న లక్ష్యంతో రాష్ట్రానికి మూడు రాజధాను ఏర్పాటు చేశారని, భవిష్యత్‌లో ఎలాంటి ప్రాంత విభేదాలు వచ్చే అవకాశం లేదన్నారు. గత ప్రభుత్వం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌ ఆరోపించారు. కార్యక్రమంలో వైఎస్సార్​సీపీ నాయకులు రైల్వేప్రసాద్‌, మద్దయ్య, సయ్యద్‌ ఆసిఫ్‌, అదిమోహన్‌ రెడ్డి, రాఘవేంద్రరెడ్డి, కృష్ణారెడ్డి, భాస్కర్‌ రెడ్డి, రాజేశ్వర్‌ రెడ్డి, కృష్ణకాంత్‌ రెడ్డి, మహిళా నాయకురాలు విజయక్ష్మి, సంపత్‌ కుమారి, వేదవతి, సుచరిత, జమిలా, తుసి, అనురాధ పాల్గొన్నారు.