యంగ్ హీరో తనీష్ ‘మహాప్రస్థానం’ సినిమాతో మళ్లీ ఫామ్లోకి రానున్నాడు. జానీ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని ఓంకారేశ్వర క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. ముస్కాన్ సేథీ హీరోయిన్. మరో కీలకపాత్రలో ‘వరుడు’ ఫేమ్ భాను శ్రీ మెహ్రా కనిపించనుంది. నిన్న తనీష్ పుట్టినరోజు సందర్భంగా సుప్రీమ్ హీరోసాయి ధరమ్ తేజ్ఈ చిత్ర టీజర్ ను రిలీజ్ చేశారు. ‘అంతా శూన్యం’ అంటూ బ్యాగ్రౌండ్ పాటతో మొదలైంది టీజర్.
ఓ గ్యాంగ్ అమ్మాయిలను కిడ్నాప్ చేసి వాళ్లని టార్చర్ చేయడం.. హీరో వాళ్లను చితక్కొట్టడం.. టీజర్ మొత్తం ఇదే అయినా టీజర్ లో ప్రజెంట్ అయిన సీన్స్ సినిమాపై ఆశక్తి కలిగిస్తున్నాయి. తనీష్ బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ‘దేవుళ్లు’ సినిమాలో అయ్యప్పగా అందర్నీ మెప్పించాడు. హీరోగా కొన్ని సినిమాలు చేసినా ఆశించిన గుర్తింపు అయితే రాలేదు. టైటిల్ దక్కించుకోలేకపోయినా ‘బిగ్ బాస్ సీజన్ 2’లో పార్టిసిపేట్ కూడా చేశాడు. ప్రస్తుతం ఈ సినిమా రీరికార్డింగ్, సీజీ పనులు చివరి దశలో ఉన్నాయి. థియేటర్స్ ఈ సినిమా క్లిక్ అయితే తనీష్ కెరీర్ మళ్లీ ఊపందుకున్నట్టే మరి.