సారథిన్యూస్, హైదరాబాద్ : తెలంగాణలో మరో ఎమ్మెల్యేకు కరోనా సోకింది. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందగౌడ్కు కరోనా సోకినట్టు సమాచారం. ఆయన భార్య సౌజన్య, కుమారుడు విధాత్‌లకు సైతం కోవిడ్ సోకినట్లు ఆదివారం వైద్యులు వెల్లడించారు. ఎమ్మెల్యే కుటుంబసభ్యులు ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. ఇటీవల ఎమ్మెల్యే పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అక్కడే ఎమ్మెల్యేకు కరోనా సోకి ఉంటుందని ఆయన కుటుంబసభ్యలు తెలిపారు. కాగా ప్రస్తుతం ఎమ్మెల్యే ఆరోగ్యం నిలకడగానే ఉన్నదని.. లక్షణాలు కూడా ఎక్కువగా లేవని వైద్యులు తెలిపారు.
- July 20, 2020
- Archive
- తెలంగాణ
- షార్ట్ న్యూస్
- CARONA
- HYDERABAD
- ISOLATION
- MLA
- ఎమ్మెల్యే
- తెలంగాణ
- Comments Off on మరో ఎమ్మెల్యేకు కరోనా