ఢిల్లీ: ఇటీవలే కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయిన కేంద్రహోం మంత్రి అమిత్ షా మరోసారి అస్వస్థతకు గురయ్యారు. శనివారం అర్ధరాత్రి ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తాయి. దీంతో కుటుంబసభ్యులు వెంటనే ఎయిమ్స్‌కు తరలించారు. ఆగస్టు 2న అమిత్ షాకు కరోనా పాటిజివ్ గా నిర్ధారణ అయ్యింది. గురుగ్రామ్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్సపొందిన ఆయన 14న డిశ్చార్జి అయ్యారు. అయితే ఆగస్టు 18న అయన మరోసారి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఎయిమ్స్‌లో చేరారు. అనంతరం 30న ఆయన డిశ్చార్జి అయ్యారు. కాగా ఆయనకు ప్రస్తుతం మరోసారి తీవ్రశ్వాససంబంధిత ఇబ్బందులు తలెత్తాయి. ప్రస్తుతం ఆయనకు వైద్యులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. అమిత్‌షా ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ముందుజాగ్రత్త కోసం పూర్తిస్థాయి పరీక్షలు నిర్వహిస్తున్నట్టు ఎయిమ్స్ వైద్యులు తెలిపారు.