సారథిన్యూస్, రామగుండం: మద్యం దొంగతనం చేస్తున్న ఓ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జిల్లా అప్పనపేట శివారులో పోలీసులు తనిఖీలు చేస్తుండగా ఈ ముఠా పట్టుబడింది. నిందితుల వద్ద నుంచి 3 బైక్లు, 2 ట్రాలీ ఆటోలు, రూ. 3,66,800 విలువైన మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన శేఖర్, కుమ్మాటి రాజు, కుర్ర అంజయ్య ముఠాగా ఏర్పడి పలు చోట్ల మద్యం దుకాణాలను లూఠీ చేయడంతోపాటు, ద్విచక్రవాహనాలను చోరీ చేసినట్టు పోలీసులు తెలిపారు. వీరిపై కరీంనగర్ వన్ టౌన్, జగిత్యాల, ఎన్టీపీసీ, శ్రీరాంపూర్ ,పెద్దపల్లి, బసంత్ నగర్లలో అనేక కేసులు నమోదయ్యాయి. వీరంతా అప్పన్నపేట శివారులో అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
- July 6, 2020
- Archive
- కరీంనగర్
- క్రైమ్
- లోకల్ న్యూస్
- AREST
- GANG
- LIQUOR
- POLICE
- RAMAGUNDAM
- దొంగలు
- ముఠా
- Comments Off on మద్యం దొంగలు అరెస్ట్