Breaking News

మంత్రి హరీశ్​రావు పీఏకు కరోనా!

కరోనా టెస్ట్​

సారథిన్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. సామాన్యులు, ఉన్నతాధికారులు, రాజకీయనేతలను సైతం కరోనా వణికిస్తున్నది. తాజాగా జనగామ టీఆర్​ఎస్​ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డికి కరోనా సోకింది. జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ డ్రైవర్‌కు కరోనా పాజిటివ్​ రావడంతో మేయర్​ కుటుంబం హోంక్వారంటైన్​లోకి వెళ్లిపోయింది. తాజాగా మంత్రి హరీశ్​రావు పీఏకు కరోనా సోకడంతో హరీశ్​రావు కుటుంబం హోంక్వారైంటైన్​కు వెళ్లినట్టు సమాచారం. మరోవైపు సిద్ధిపేట కలెక్టర్ వెంకట్రామారెడ్డి కూడా సెల్ఫ్ ఐసోలేషన్లోకి వెళ్లారు. ఇటీవల జెడ్పీటీసీలు కలెక్టర్‌ను కలవగా.. వారి వెంట వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం అతడు హైదరాబాద్‌లో చికిత్స పొందుతున్నాడు. యాదాద్రి జెడ్పీ సీఈవోకు కరోనా పాజిటివ్ అని తేలగా.. జూన్ 5న ఆయనతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్ అనితా రామచంద్రన్ హోం క్వారంటైన్లోకి వెళ్లారు. సీఈవోతో కాంటాక్టులో ఉన్న అధికారులు, ఉద్యోగులంతా ఇంటి నుంచే పని చేస్తున్నారు.