సారథి న్యూస్, రామయంపేట: పాత కక్షల నేపథ్యంలో భార్యాభర్తలపై కత్తితో ఓ వ్యక్తి దాడిచేశాడు. శనివారం ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రానికి చెందిన బోయిని శ్రీనివాస్ అతని భార్య కనకవ్వలపై అదే గ్రామానికి చెందిన తమ్మల ప్రభాకర్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఇరు కుటుంబాల మధ్య ఉన్న పాతకక్షలే కారణమని గ్రామస్తులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన భార్యాభర్తలను చికిత్స కోసం రామాయంపేట గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
- December 26, 2020
- Archive
- క్రైమ్
- medak
- NIZAMPET
- RAMAYAMPET
- నిజాంపేట
- మెదక్
- రామాయంపేట
- Comments Off on భార్యాభర్తలపై కత్తితో దాడి