సారథిన్యూస్, రామడుగు: కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని వివిధ గ్రామాల్లో పోలీసులు భారీగా గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నాలుగు రోజులుగా వివిధ గ్రామాల్లో సోదాలు చేపట్టారు. అక్రమంగా విక్రయిస్తున్న నిషేధిత గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. 22, 600 విలువ గల గుట్కాప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. మోతే గ్రామానికి చెందిన తిరుపతి, పుదారి శ్రీనివాస్, లక్ష్మీపూర్‌కు చెందిన సురేశ్, గుండికి చెందిన చిట్ల మునీందర్లపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై అనూష వెల్లడించారు.
- June 26, 2020
- Archive
- కరీంనగర్
- GUTKA
- KARIMNAGAR
- POLICE
- RIDE
- గుట్కాప్యాకెట్లు
- రామడుగు
- Comments Off on భారీగా గుట్కా పట్టివేత