Breaking News

భారత్ బయోటెక్ ను సందర్శించిన ప్రధాని మోడీ

భారత్ బయోటెక్ ను సందర్శించిన ప్రధాని మోడీ

సారథి న్యూస్​, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోడీ శనివారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ సంస్థను సందర్శించారు. వ్యాక్సిన్ ​తయారీలో సాధించిన పురోగతిని శాస్త్రవేత్తలు ప్రధాని మోడీకి వివరించగా.. వారి కృషిని ఆయన అభినందించారు. ఇప్పటివరకు సాధించిన ప్రగతిని తెలుసుకుని సంతృప్తి వ్యక్తం చేశారు. కోవిడ్-19ను అరికట్టేందుకు స్వదేశీ వ్యాక్సిన్ తయారీలో సాధించిన పురోగతిని సైంటిస్టులు తనకు వివరించారని ప్రధాని మోడీ ట్వీట్​చేశారు. అంతకుముందు మోడీ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని జైడస్ బయోటెక్ పార్క్‌లో కోవిడ్-19 వ్యాక్సిన్ తయారీపై సమీక్షించారు. వ్యాక్సిన్ తయారీకి కృషి చేస్తున్న శాస్త్రవేత్తలను అభినందించారు. ప్రధాని మోడీ అంతకు ముందు హకీంపేట విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకున్నారు. అనంతరం హైదరాబాద్ ​నుంచి ప్రధాని మోడీ ప్రత్యేక విమానంలో పుణేలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌లో వ్యాక్సిన్ తయారీ పురోగతిని సమీక్షించనున్నారు.

భారత్ బయోటెక్ శాస్త్రవేత్తలతో మాట్లాడుతున్న భారత ప్రధాన మంత్రి నరేంద్రమోడీ