సారథి న్యూస్, హైదరాబాద్: భారతరత్న, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్అంబేద్కర్ 64వ వర్ధంతి సందర్భంగా ఆదివారం అసెంబ్లీ ఆవరణలో ఉన్న ఆయన విగ్రహానికి శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్దేశానికి చేసిన సేవలను కొనియాడారు. కార్యక్రమంలో మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ లు గొంగడి సునిత, రేగా కాంతారావు, శాసనమండలి విప్ ఎంఎస్ ప్రభాకర్ రావు, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, అసెంబ్లీ ముఖ్య కార్యదర్శి నరసింహాచార్యులు, పి.రమేష్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ భవన్లో..
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 64 వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ భవన్ లో రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు, హోంశాఖ మంత్రి మహమూద్‌అలీ, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు, పలువురు టీఆర్ఎస్ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.