Breaking News

భజ్జీ ‘ఫ్రెండ్ షిప్’​పై సచిన్​ కామెంట్​

ప్రముఖ క్రికెట‌ర్‌ హర్భజన్ సింగ్ హీరోగా నటిస్తున్న ‘ఫ్రెండ్ షిప్’ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ విడుదలై మంచి రెస్పాన్స్ రాబట్టింది. ఈ చిత్ర ఫస్ట్ లుక్ ను ట్విట్టర్ లో హర్భజన్ సింగ్ షేర్ చేయగా, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ స్పందిస్తూ.. ‘ఫ్రెండ్ షిప్ గురించి అయితే తప్పకుండా చూడాల్సిందే, భజ్జీ’ అని ట్వీట్ చేశారు. సచిన్ ట్వీట్ ‘ఫ్రెండ్ షిప్’ సినిమా మీద అందరిలో మరింత ఆసక్తి పెంచింది.

సచిన్​ కామెంట్​

త‌మిళ బిగ్ బాస్ ఫేమ్ లోస్లియా మ‌రియ‌నేస‌న్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో కీలకపాత్రల్లో యాక్షన్ కింగ్ అర్జున్, త‌మిళ న‌టుడు స‌తీష్‌ న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి జాన్ పాల్ రాజ్‌, శ్యామ్ సూర్య దర్శకత్వం వ‌హిస్తున్నాడు. సీన్‌టో స్టూడియోస్‌, సినీమాస్ స్టూడియోస్ ప‌తాకాల‌పై జేపీఆర్, స్టాలిన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ, త‌మిళ్‌, ఇంగ్లిష్ భాషల్లో విడుదల చేస్తున్నారు.