సారథి న్యూస్, నిజాంపేట: మెదక్ జిల్లా నందిగామలో దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం దుర్గామాత బోనాలను భక్తిశ్రద్ధలతో ఊరేగించారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ సభ్యుడు లద్ధ సురేష్ మాట్లాడుతూ .. ప్రతి ఇంటి నుంచి బోనాలను సర్వంగా సుందరంగా అలంకరించి ఊరేగింపు నిర్వహించామని తెలిపారు. అనంతరం ఊర రేణుక పోచయ్య ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ లద్ధప్రీతి రాజగోపాల్, ఉపసర్పంచ్ గెల్లు రాజాం, రైతు బంధు సమితి మండలాధ్యక్షుడు బిజ్జ సంపత్, విగ్రహ దాత గొల్ల మమత శ్రీనివాస్, దుర్గామాత ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
- October 23, 2020
- Archive
- మెదక్
- లోకల్ న్యూస్
- DEVINAVRATHRI
- medak
- NIZAMPET
- దేవీశరన్నవరాత్రి
- నిజాంపేట
- మెదక్
- Comments Off on భక్తిశ్రద్ధలతో నవరాత్రి ఉత్సవాలు