ప్రస్తుతం బాలకృష్ణ ‘లెజెండ్, సింహా’వంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన బోయపాటి దర్శకత్వంలో మూడో సినిమాలో నటిస్తున్నాడు. రీసెంట్ గా బాలయ్య బాబు పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ రిలీజై సినిమాపై అంచనాలు కూడా పెంచేసింది. అయితే బాలకృష్ణ ఈ సినిమా తర్వాత నెక్ట్స్ మూవీ దర్శకుడు బి.గోపాల్‌తో చేయాలి అనుకుంటున్నాడట. బాలయ్యకు మొదటిసారి మాస్ ఇమేజ్ తెచ్చిన దర్శకుడు బి.గోపాల్. వారిద్దరి కాంబినేషన్లో ‘లారీ డ్రైవర్, రౌడీ ఇన్ స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, పల్నాటి బ్రహ్మనాయుడు’ వంటి బంపర్ హిట్స్ ఉన్నాయి. అందుకే మళ్లీ ఈసారి బి.గోపాల్ సినిమా చేయాలని నిశ్చయించుకున్నాడట బాలయ్య. ఈ కాంబినేషన్ కోసం రైటర్ సాయిమాధవ్ బుర్రా స్ట్రిప్ట్ రెడీ చేస్తున్నాడని టాక్. ఈ సినిమాలో బాలకృష్ణ రైతుగా కనిపించనున్నాడట. వీరి కాంబినేషన్ అంటేనే బాలయ్య అభిమానులు భారీ అంచనాలు వేసేసుకుంటారు. ఆ అంచనాలకు తగ్గకుండా చిత్రాన్ని తెరకెక్కించాలని సన్నాహాలు చేస్తున్నారట బి.గోపాల్.
- June 30, 2020
- Archive
- Top News
- సినిమా
- B.GOPAL
- BALAKRISHNA
- BOYAPATI
- బాలకృష్ణ
- బి.గోపాల్
- బోయపాటి
- Comments Off on బి.గోపాల్ డైరెక్షన్లో మరోసారి..