Breaking News

బిహార్​ బీజేపీదే

బిహార్​ బీజేపీదే

పట్నా: ఉత్కంఠభరితంగా సాగిన బిహార్​ అసెంబ్లీ ఎన్నికల పోరులో విజయం ఎన్డీయేను వరించింది. ఎన్నికల కౌంటింగ్‌ మంగళవారం అర్ధరాత్రి దాకా కొనసాగింది. మొత్తం 243 స్థానాల్లో అసెంబ్లీలో మెజారిటీ మార్క్‌ 122 కాగా, రెండు సీట్లు ఎక్కువ గెలుచుకుని 124 సీట్లతో ఎన్డీయే అధికారాన్ని కైవసం చేసుకుంది. బీజేపీ అత్యధికంగా 73 స్థానాలను గెలుచుకుంది. గత ఎన్నికల్లో 71 సీట్లు గెలుచుకున్న ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ పార్టీ జేడీయూ ఈ సారి 43 స్థానాలకే పరిమితమైంది. కూటముల వారీగా చూస్తే.. అధికార ఎన్డీయేలో.. బీజేపీ 73, జేడీయూ 43, వికాస్‌శీల్‌ ఇన్సాన్‌ పార్టీ(వీఐపీ) 4, హెచ్‌ఏఎం 4 స్థానాల చొప్పున గెలుచుకున్నాయి. విపక్ష మహాకూటమిలో ఆర్జేడీ 76, కాంగ్రెస్‌ 19, లెఫ్ట్‌ పార్టీలు 16 సీట్లలో విజయం సాధించాయి. మొత్తంగా మహా కూటమికి 111 స్థానాలు వచ్చాయి. ఎంఐఎం 5, ఇండిపెండెంట్‌ 1, ఎల్జేపీ 1, బీఎస్పీ 1 స్థానాల్లో ఘన విజయం సాధించాయి.

బిహార్​ 2020 ఎన్నికల ఫలితాలు
పార్టీ గెలుపొందిన స్థానాలు
ఎన్​డీఏ
బీజేపీ 73
జేడీయూ 43
హెచ్​ఏఎంఎస్​ 4
వీఐపీ 4
మహాకూటమి(ఎంజీబీ)
ఆర్​జేడీ 76
కాంగ్రెస్​ 19
సీపీఐ(ఎంఎల్​) 12
సీపీఎం 2
సీపీఐ 2
ఎల్​జేపీ 1
ఎంఐఎం 5
బీఎస్పీ 1
స్వతంత్రులు 1