Breaking News

బిత్తిరి సత్తి స్ర్కిప్ట్​ ​రెడీ

బిత్తిరి సత్తి స్ర్కిప్ట్​రెడీ

విలక్షణమైన నటన, వస్త్రధారణ, తెలంగాణ యాస‌, తనదైన మార్క్​హావాభావాలతో వార్తలు చెప్పే బిత్తిరి సత్తికి ‘సాక్షి’ స్ర్కిప్ట్​ ​రెడీ అయింది. త్వరలో ఆయన ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ‘సాక్షి’ ప్రోమో వీడియో ఒకటి సోషల్​ మీడియాలో హల్​చల్​ చేస్తోంది. ‘నా మనస్సాక్షిగా చెబుతున్న బిడ్డా.. ఇది తండ్రిని గౌరవించుకునే జాగా.. నీవు యాడికి పోయేది లేదు. ఇదే నీ అడ్డా.. అర్థమైందా బిడ్డా..’ అని తండ్రి పాత్రధారి సత్తి అనగా.. ఇగ సత్తిగాని సత్తా ఏందో చూపిస్త.. జనం గుండెల్లో నాకింత జాగిచ్చిండు. ఇగ గుండీలు ఇప్పుకుని తిరుగుతా..’ అని కొడుకుగా సత్తి పలికిన మాటలు భలే ఆకట్టుకుంటున్నాయి.

కాగా, సావిత్రి అలియాస్ జ్యోతి, చేవెళ్ల ర‌వికుమార్​ అలియాస్ బిత్తిరి స‌త్తి మొదట వీ6 చానెల్ ​‘తీన్మార్ ప్రోగ్రాం’ ద్వారా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. అక్కడ అభిప్రాయభేదాలు రావ‌డం, సావిత్రి బిగ్ బాస్ షోకు వెళ్లడంతో బిత్తిరి స‌త్తి అక్కడ రాజీనామా టీవీ9లో చేరారు. సత్తి బిగ్​బాస్​లో హౌస్​లోకి వెళ్తున్నట్లు ప్రచారం సాగింది. ఎవరూ ఊహించని విధంగా ‘సాక్షి’లో చేరారు. త్వరలోనే ఆయన షో ద్వారా ప్రేక్షకులను అలరించనున్నారు.

బిత్తిరి సత్తి స్ర్కిప్ట్​ ​రెడీ | SARATHIMEDIA | SARATHITELUGU NEWS | SARATHI DIGITAL MEDIA