Breaking News

బాలయ్య బాబూ.. ఇది నిజమేనా?

బాలయ్య బాబూ.. ఇది నిజమేనా..?

అప్పుడెప్పుడో బెల్లకొండ సురేష్, బాలకృష్ణ కాంబినేషన్​లో వచ్చిన ‘లక్ష్మీ నరసింహ’ సినిమా విషయంలో పెద్ద గొడవలే జరిగాయి. సినిమా హిట్టయినా బెల్లంకొండ, బాలయ్య బాబుకు విభేదాలు వచ్చాయంటూ ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు వాటికి తెరదించనట్టున్నారు ఇద్దరూ. సురేష్ కొడుకు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా హిట్, ఫట్లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేసేస్తున్నాడు. తాజాగా బాలకృష్ణ సాయి శ్రీనివాస్​తో కలిసి నటించేందుకు ఒప్పుకున్నాడన్న వార్తొకటి ఫిల్మ్​నగర్​లో హల్​చల్​ చేస్తోంది. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలోని కీలకసన్నివేశాల్లో శ్రీనివాస్ ను తీసుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయట. ఆ పవర్ ఫుల్ పాత్ర శ్రీనివాస్ చేస్తే బాగుంటుందని బోయపాటి ఆలోచించడం.. అందుకు బాలయ్య కూడా ఓకే చెప్పడం కూడా జరిగాయి అంటున్నారు. కరోనా కారణంగా షూటింగ్ నిలిచి పోయింది. పరిస్థితులు కుదుటపడ్డ తర్వాత ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. కాగా ఈ చిత్రంలో బాలకృష్ణ అఘోరా కనిపించే దృశ్యాల కోసం కాశి వారణాసి ప్రాంతాల్లో చిత్రీకరణ ఉంటుందట.