సారథి న్యూస్, హయత్‌నగర్: రెండు రోజులుగా కురుస్తున్న అతి భారీ వర్షాల కారణంగా హయత్నగర్డివిజన్ పరిధిలోని రంగనాయకులగుట్ట, బంజారాకాలనీ, అంబేద్కర్ కాలనీ, భగత్ సింగ్ కాలనీ లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. చాలా ఇళ్లలోకి వరద నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. టీడీపీ హయత్ నగర్ డివిజన్ సీనియర్ నాయకులు సింగిరెడ్డి మురళీధర్ రెడ్డి పార్టీ కార్యకర్తలతో తరలి వెళ్లి వరద నీళ్లలో చిక్కిన బాధితులను తాడు సాయంతో ఎత్తు ప్రదేశానికి తరలించారు. బాధితులందరికీ పునరావాసం కల్పించి భోజనం వసతి ఏర్పాట్లు కల్పించారు. మరికొంత మందికి బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ప్రజలు వరద ముంపునకు గురై ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి వరద ముంపునకు గురయ్యే కాలనీలో శాశ్వత పరిష్కార ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు జెనిగె మహేందర్, కిరణ్, టిల్లు, కాలనీవాసులు బలరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.
- October 15, 2020
- Archive
- లోకల్ న్యూస్
- షార్ట్ న్యూస్
- హైదరాబాద్
- HAYATHNAGAR
- HEAVYRAINS
- MURALIDHARREDDY
- SINGIREDDY
- TDP
- టీడీపీ
- భారీవర్షాలు
- మురళీధర్‌రెడ్డి
- సింగిరెడ్డి
- హయత్‌నగర్
- Comments Off on బాధితులకు అండగా సింగిరెడ్డి మురళీధర్ రెడ్డి