సారథిన్యూస్, ఖమ్మం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖమ్మం జిల్లాకు చెందిన 12 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. మృతుల కుటుంబాలు ఒక్కొక్కరికీ సీఎం కేసీఆర్ రూ. 2 లక్షల పరిహారం అందించారు. మరోవైపు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాధితకుటుంబాలకు రూ.20 వేలు తక్షణసాయం ప్రకటించారు. జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజ్, మంత్రి పువ్వాడ అజయ్ బాధితకుటుంబాలను పరామర్శించారు. ప్రమాదంలో గాయపడి ఖమ్మం ప్రభుత్వదవాఖానలో చికిత్సపొందుతున్న వారిని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఆదేశాల మేరకు టీఆర్ఎస్ నాయకులు మద్దినేని స్వర్ణకుమారి, ఖమ్మం ఎంపీ క్యాంప్ కార్యాలయ ఇంచార్జి కనకమేడల సత్యనారాయణ, నాయకులు చిత్తారు సింహాద్రి యాదవ్, మందపాటి వెంకటేశ్వరరావు తదితరులు పరామర్శించారు.