Breaking News

బడ్జెట్ తగ్గాలి.. సినిమా కంప్లీట్​ కావాలి

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య మూవీ చేస్తున్నారు. అయితే కరోనా భారీ బడ్జెట్ చిత్రాల మీద తీవ్ర ప్రభావం చూపుతోంది. భారీ బడ్జెట్​తో తెరకెక్కబోయే సినిమాల షూటింగ్​లు కూడా తిరిగి మొదలు పెట్టడానికి సందేహం వ్యక్తం చేస్తున్నారు. నిర్మాతలకు పెరగనున్న ఆర్థిక భారాన్ని దృష్టిలో ఉంచుకుని నటీనటులు, ఇతర టెక్నీషియన్లు వారి రెమ్యునరేషన్ తగ్గించుకుంటే బాగుండు అన్న వాదనకూడా వినిపిస్తోంది. ఈ విషయాలు పక్కన పెడితే ‘ఆచార్య’ సినిమా విషయంలో చిత్ర బృందం బడ్జెట్​లో కోత విధించాలన్న నిర్ణయాన్ని తీసుకుందట.

అసలే కొరటాల సినిమాలంటే సందేశాలతో కూడినవే కాదు, కమర్షియల్ హంగులూ ఎక్కువగా ఉంటాయి. బడ్జెట్ భారీగానే ఉంటుంది. అందుకే సినిమాను వీలైనంత తక్కువ బడ్జెట్​తో తక్కువ రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేయాలని అంటున్నారట మెగాస్టార్ చిరంజీవి. దేవాదాయ ధర్మాదాయ శాఖలో జరిగే అన్యాయాల గురించే పోరాడే క్రమంలో మెగాస్టార్ నక్సలైట్​గా కనిపించనున్నారు. రామ్ చరణ్ కూడా ఓ కీలకపాత్రలో కనిపించనున్నాడు ఈ సినిమాలో.. అయితే పరిస్థితుల దృష్ట్యా మెగాస్టార్ బడ్జెట్ విషయంలో ఈ నిర్ణయం తీసుకోవడం సబబే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.