సారథిన్యూస్, గోదావరిఖని: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ బడుగు, బలహీనవర్గాల అశాజ్యోతి అని దళితసంఘాల నాయకులు పేర్కొన్నారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద రిజర్వేషన్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం సెంట్రల్ కమిటీ సభ్యుడు వడ్డెపల్లి శంకర్, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బొంకూరి మధు.. అంబేద్కర్ విగ్రహానికి, చత్రపతి సాహుమహరాజ్, మహాత్మా జ్యోతిరావుపూలే చిత్రపటాలకు పూలమాలలవేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అంబేద్కర్ కృషి వల్లే దళితులు రిజర్వేషన్లు పొందుతున్నారని, ఆత్మగౌరవంతో బతుకుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో దళితసంఘాల నేతలు ములుగు రాజు, మంతెన లింగయ్య పోగుల రంగయ్య, రాజలింగం, రవికుమార్, లచ్చులు, హనుమంతు, పంజా అశోక్, గంటయ్య, నారాయణ. అంకుష్, నర్సింగ్ తదితరులు పాల్గొన్నారు.
- July 26, 2020
- Archive
- కరీంనగర్
- లోకల్ న్యూస్
- AMBETHKAR
- GODAVARIKHANI
- PEDDAPALLY
- అంబేద్కర్
- దళితసంఘాలు
- Comments Off on బడుగుల ఆశాజ్యోతి అంబేద్కర్