Breaking News

బడి మెరిసె.. ఆనందం వెల్లివిరిసె

బడి మెరిసె.. ఆనందం వెల్లివిరిసె

  • ‘జగనన్న విద్యాకానుక’’తో విద్యార్థులకు భరోసా
  • బాగా చదివి ఉన్నత శిఖరాలు అధిరోహించండి
  • కర్నూలు నగర ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్‌

సారథి న్యూస్, కర్నూలు: విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు భరోసా కల్పించడమే సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి లక్ష్యమని కర్నూలు నగర ఎమ్మెల్యే ఎంఏ హఫీజ్‌ఖాన్‌ అన్నారు. గురువారం నగరంలోని ఇందిరాగాంధీ మెమోరియల్‌ స్కూల్‌, ఏ క్యాంప్‌ గవర్నమెంట్‌ స్కూల్‌, బీ క్యాంప్‌ బాలబాలికల స్కూలు, మున్సిపల్‌ ప్రైమరీ స్కూలులో ‘జగనన్న విద్యాకానుక’ పథకాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగనన్న విద్యాకానుక పథకం పేద విద్యార్థుల ఒక వరం లాంటిదని, ఎంతోమంది పేదలు తమ పిల్లలను చదివించుకునే స్థోమత లేకపోవడంతో మధ్యలోనే ఆపివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఏడాది నుంచి ఒకటి నుంచి పదవ తరగతి వరకు పిల్లలకు స్కూలు బ్యాగ్‌లు, పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, మూడు జతలకు సరిపడా వస్త్రం, కుట్టించుకున్నందుకు అమ్మ అకౌంట్‌ లోకి డబ్బు, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, టై, బెల్టులు, కరోనా దృష్టిలో ఉంచుకుని మాస్కులు ఇస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అధికారులు పాల్గొన్నారు.